అరసవల్లి: ప్రత్యక్ష దైవం అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో భానుసప్తమి పర్వదినం సందర్భంగా భక్తుల సందడి కనిపించింది. స్థానికులతో పాటు ఇతర జిల్లాల నుంచి కూడా భారీగా భక్తులు తరలిరావడంతో ఆలయ క్యూలైన్లు కిక్కిరిసిపోయాయి. ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ ఆధ్వర్యంలో అర్చకబృందం రూ.300 వీఐపీ టికెట్లు కొనుగోలు భక్తులకు అంతరాలయ దర్శనాన్ని చేయించారు. ఈవో కె.ఎన్.వి.డి.వి.ప్రసాద్, ఏఈవో అప్పలనాయుడు ఆధ్వర్యంలో భక్తులకు మౌలిక సౌకర్యాలు కల్పించారు. సీఎంఆర్ గ్రూప్ యాజమాన్యం ఉచితంగా పరమాన్నం, పెసల


