కాగితాలకే పరిమితం.. | - | Sakshi
Sakshi News home page

కాగితాలకే పరిమితం..

Jun 22 2026 12:06 AM | Updated on Jun 22 2026 12:06 AM

కాగితాలకే పరిమితం..

అంతా గందరగోళం

సౌకర్యాలు కల్పించకపోవడం విమర్శలకు తావిస్తోంది. కంప్యూటర్‌ కాటాలకు చార్జింగ్‌ పెట్టుకునేందుకు ప్లగ్‌పిన్‌లు కూడా లేవు. ఫ్యాన్‌లు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రెండు, మూడు షాపులకు ఒక లైటుతో చాలీచాలనీ విద్యుత్‌ కాంతితో చీకటిపడితే వ్యాపారాలు చేయలేని పరిస్థితి. మరుగుదొడ్ల పరిస్థితి మరింత దారుణం. పురుషులకు ఆరు మరుగుదొడ్లకు గాను రెండు మాత్రమే తెరిచి ఉన్నాయి. మహిళల మరుగుదొడ్లదీ అదే పరిస్థితి.

చినుకుపడితే చెరువే..

రైతుబజారును ఎత్తుచేయాలని, మార్కెట్‌ మధ్యలో నిలిచిపోయిన వర్షం నీరు బయటకు వెళ్లేలా చేయాలని టీడీపీ ప్రభుత్వ హయాంలో పలుమార్లు నిధులు మంజూరు చేయడం..అరకొర పనులు చేసి నిధులు స్వాహా చేయడం వంటివి చేస్తున్నారు. గతంలో రైతుబజారు ఆధునికీకరణ పేకట సుమారు రూ.40లక్షలు నిధులు ఖర్చుచేసి నాణ్యతలేని పనులు చేసి మమా అనిపించేశారు. దీంతో కొద్దిపాటి వర్షం కురిసినా రైతుబజారులోకి వెళ్లలేని పరిస్థితి. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి రైతుబజారు అభివృద్ధిపై దృష్టి సారించాలని రైతులు, వ్యాపారులు, కొనుగోలుదారులు కోరుతున్నారు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement