ఆమదాలవలస: సుమారు రెండున్నర దశాబ్దాల కిందట ఆమదాలవలసలో బస్టాండ్ సమీపంలో రైతుబజార్ ఏర్పాటు చేశారు. తాజా కూరగాయలు లభించడంతో ప్రారంభంలో బాగానే కొనుగోళ్లు జరిగాయి. తర్వాత ప్రధాన రహదారిపై కొంతదరు వ్యాపారులు కూరగాయల దుకాణాలు ఏర్పాటు చేసి ఎక్కడికక్కడే అమ్మకాలు జరపడంతో రైతుబజారుకు వెళ్లే వారు కరువయ్యారు. క్రమంగా ఆదరణ కరువైంది. తొలుత 28 దుకాణాలతో ప్రారంభమైనా.. ఇప్పు ఒక్క దుకాణం కూడా తెరుచుకోక పూర్తిగా మూతపడింది. 2015లో కొంతభాగం అన్న క్యాంటీన్‌కు కేటాయించడంతో మిగిలిన దుకాణాలు మూతపడ్డాయి. రైతుబజారుకు నిధులు కేటాయించి పున:ప్రారంభిస్తే బాగుంటుందని రైతులు, పట్టణవాసులు కోరుతున్నారు.


