శ్రీకాకుళం కల్చరల్: ఆరోగ్యకర సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ యోగాసనాలను జీవితంలో భాగం చేసుకోవాలని గిరిజన సంక్షేమ శాఖ ఉప సంచాలకుడు అన్నాదొరై పిలుపునిచ్చారు. శనివారం జిల్లా కేంద్రంలోని కార్గిల్ పార్కులో గిరిజన సంక్షేమ శాఖ, ఏపీఈపీడీసీఎల్ శాఖల ఆధ్వర్యంలో ఆయుష్ శాఖ సమన్వయంతో ప్రత్యేక యోగ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యోగాతో మానసిక ప్రశాంతత చేకూరుతుందన్నారు. ఏపీఈపీడీసీఎల్ ఎస్ఈ జీఎన్ ప్రసాద్ మాట్లాడుతూ నిరంతరం యోగాసనాలు సాధన చేయడం వల్ల రోగ నిరోధక శక్తి పెరగడమే కాకుండా రోజంతా ఉత్సాహంగా ఉంటుందన్నారు. జిల్లా ఆయుష్ అధికారి డాక్టర్ ఉత్తమ్రాజ్ రాణా మాట్లాడుతూ రోజువారీ జీవితంలో ఎదురయ్యే ఒత్తిడి, ఆందోళనలను తగ్గించడంలో యోగా, ధ్యానం కీలక పాత్ర పోషిస్తాయన్నారు. సమావేశంలో అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


