రెవెన్యూ శాఖ సేవలు భేష్‌ | - | Sakshi
Sakshi News home page

రెవెన్యూ శాఖ సేవలు భేష్‌

Jun 21 2026 12:37 AM | Updated on Jun 21 2026 12:37 AM

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: కాగితంపై ఉండే వివరాలు, క్షేత్ర స్థాయిలో ఎదురయ్యే ఇబ్బందులను సరిగ్గా బేరీజు వేసి ప్రభుత్వానికి మంచిపేరు తీసుకురావడంలో రెవెన్యూ వ్యవస్థ సమర్థంగా పని చేస్తోందని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు అన్నారు. శనివారం శ్రీకాకుళం నగరంలోని బాపూజీ కళామందిర్‌లో రెవెన్యూ డే వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ మాట్లాడుతూ ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన, ఫలితాల ఆధారిత సేవలందించడమే ప్రతి రెవెన్యూ ఉద్యోగి లక్ష్యంగా ఉండాలన్నారు. జాయింట్‌ కలెక్టర్‌ ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌ మాట్లాడుతూ బాధ్యతాయుతంగా, పారదర్శకంగా విధులు నిర్వర్తించాలన్నారు. అనంతరం ఉత్తమ ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు అందజేశారు. సమావేశంలో శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్‌, ఆర్డీఓ కె.సాయిప్రత్యూష, డిప్యూటీ కలెక్టర్లు పద్మావతి, జి.జయదేవి, సివిల్‌ సప్లయ్‌ డీఎం వేణుగోపాల్‌, కలెక్టరేట్‌ పరిపాలన అధికారి సూర్యనారాయణ, రిటైర్డ్‌ జేసీ–2 రజనీకాంతరావు, రిటైర్డ్‌ ఆర్డీఓ పీఎంజే బాబు, సెక్షన్‌ సూపరింటెండెంట్‌ నాగేశ్వరరెడ్డి, రెవెన్యూ సర్వీసెస్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు గణపతిరావు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement