సునీల్‌కుమార్‌ అరెస్టు అక్రమం | - | Sakshi
Sakshi News home page

సునీల్‌కుమార్‌ అరెస్టు అక్రమం

Jun 21 2026 12:37 AM | Updated on Jun 21 2026 12:37 AM

కంచిలి : మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు, బీసీ యువ నాయకుడు సునీల్‌ను అక్రమంగా అరెస్టు చేయడం తగదని ఎమ్మెల్సీ నర్తు రామారావు ఆరోపించారు. కంచిలిలో శనివారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనపై నిప్పులు చెరిగారు. టీడీపీ కూటమి ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకుంటూ ప్రజల దృష్టిని మళ్లించేందుకు రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం శోచనీయమన్నారు. కారుమూరి సునీల్‌కుమార్‌ను అరెస్ట్‌ చేయటం దుర్మార్గ చర్యగా అభివర్ణించారు. లేని మద్యం కుంభకోణాన్ని సృష్టించి వైఎస్సార్‌ సీపీ నేతలను వేధిస్తున్నారని మండిపడ్డారు. వైఎస్సార్‌ సీపీ హయాంలో మద్యం విక్రయాలు పారదర్శకంగానే జరిగాయని చెప్పారు. 2014–19 మధ్య కాలంలో రాష్ట్రంలో అంతులేని మద్యం అక్రమాలు జరిగాయని, వాటి నుంచి దృష్టి మళ్లించేందుకు ప్రస్తుతం లేని మద్యం స్కామ్‌ సృష్టించి అక్రమ కేసులు బనాయిస్తున్నారని ధ్వజమెత్తారు. విజయవాడ కృష్ణలంక పోలీస్‌ స్టేషన్‌లో సాయికృష్ణ లాకప్‌డెత్‌, క్రాంతికుమార్‌ ఆత్మహత్య, డీఎస్సీ–25లో అంతులేని అక్రమాలు, అవినీతి, అమరావతిలో వేలాది మంది రైతుల్లో వ్యతిరేకత, ఆక్వా రైతుల ఉద్యమాలు.. ఇలా టీడీపీ కూటమి ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు నీచ రాజకీయాలకు తెగబడ్డారని మండిపడ్డారు. టీడీపీ అక్రమ అరెస్టులు ఆపకపోతే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారన్నారు. సమావేశంలో పార్టీ నేతలు రామదాసు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement