పర్లాకిమిడి: గజపతి జిల్లాలోని గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా కేంద్రం హాల్‌లో జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పీఎం కిసాన్ వేడుకలు శనివారం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అదనపు జిల్లా మేజిస్ట్రేట్ మునీంద్ర హానగ విచ్చేసి ప్రారంభించగా, ఇతర అతిథులుగా జిల్లా ముఖ్య వ్యవసాయ అధికారి ఎం.ప్రకాశరావు, జిల్లా కృషి అధికారి రవీంద్ర కుమార్ అథెక్, ఉద్యానవన శాఖ డిప్యూటీ డైరక్టర్ శశాంక శేఖర్ సాహు, ఆర్.ఉదయగిరి కృషి విజ్ఞాన కేంద్రం వైజ్ఞాణికులు జన్నురియాస్ ఖుజుర్ తదితరులు పాల్గొన్నారు.


