నీతి అయోగ్‌ బృందం పర్యటన | - | Sakshi
Sakshi News home page

నీతి అయోగ్‌ బృందం పర్యటన

Jun 21 2026 12:31 AM | Updated on Jun 21 2026 12:31 AM

నీతి అయోగ్‌ బృందం పర్యటన

కొరాపుట్‌: నబరంగ్‌పూర్‌ జిల్లాలో నీతి అయోగ్‌ బృందం శనివారం పర్యటించింది. డాబుగాం, తెంతుకుంటి సమితుల్లో నీతి అయోగ్‌ కేంద్ర ఇన్‌చార్జి మీరా మహంతి క్షేత్ర పర్యటన చేశారు. తెంతులకుంటి సమితిలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో తల్లీ, బిడ్డలకు అందిస్తున్న పౌష్టికాహారం, విద్య, ఆరోగ్య సేవలపై ఆరా తీశారు. కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌లో ఉన్న ఆరోగ్య సేవల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతర ఇంద్రావతి డ్యామ్‌ను పరిశీలించారు. నబరంగ్‌పూర్‌ జిల్లాలో ఇథనాల్‌ ప్లాంట్‌ ఏర్పాటు, కోల్డ్‌ స్టోరేజీ ఏర్పాటు, మొక్కజొన్న పరిశ్రమ ఏర్పాటు వంటి నిర్మాణాల పురోగతి పరిశీలించారు. ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన పెంచాలని అధికారులను సూచించారు. పర్యటనలో నబరంగ్‌పూర్‌ జిల్లా కలెక్టర్‌ మహేశ్వర్‌ స్వయ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement