నబరంగ్‌పూర్‌ ఎస్పీని కలిసిన కిన్నెరలు | - | Sakshi
Sakshi News home page

నబరంగ్‌పూర్‌ ఎస్పీని కలిసిన కిన్నెరలు

Jun 20 2026 11:43 AM | Updated on Jun 20 2026 11:43 AM

కొరాపుట్‌: నబరంగ్‌పూర్‌ జిల్లాకు నూతనంగా వచ్చిన ఎస్పీ పార్ధవ్‌ కశ్యప్‌ని కిన్నెర సంఘం ప్రతినిధులు గౌరవ ప్రదంగా కలుసుకున్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయానికి కిన్నెరలు పెద్ద ఎత్తున చేరుకున్నారు. సామాజిక కార్యకర్త షర్మిష్ట దేవ్‌ నేతృత్వంలో ఎస్పీకి తమ సమస్యలు విన్నవించారు. ప్రస్తుతం సమాజంలో గౌరవంగా వివిధ వృత్తులలో జీవనం సాగిస్తున్నామన్నారు. జిల్లాకు వచ్చిన ఉన్నతాధికారులు తమ భద్రత కోసం అనేక విధాలుగా సహకరించారన్నారు. జిల్లాలో కిన్నెరలు సామాజిక భద్రత తో జీవించడానికి ఎస్పీ సహకరించాని విజ్ఞప్తి చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement