అభివృద్ధికి ప్రజలు సహకరించాలి | - | Sakshi
Sakshi News home page

అభివృద్ధికి ప్రజలు సహకరించాలి

Jun 20 2026 11:43 AM | Updated on Jun 20 2026 11:43 AM

మల్కన్‌గిరి ఎమ్మెల్యే నర్సింగ్‌ మాడ్కమి

మల్కన్‌గిరి: అభివృద్ధికి ప్రజలు సహకరించాలని మల్కన్‌గిరి ఎమ్మెల్యే నర్సింగ్‌ మాడ్కమి అన్నారు. బీజేపీ రెండేళ్లు పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా మల్కన్‌గిరి జిల్లా కేంద్రంలోని సంస్కృతి భవన్‌లో వికాస్‌ ధారా –ఒడిశా సారా కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్‌ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన మల్కన్‌గిరి ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. మారుమూల ప్రాంతాలకు సైతం ప్రభుత్వ పథకాలు చేరుతున్నాయన్నారు. రానున్న రోజుల్లో అర్హులందరికీ సంక్షేమ పథకాలు చేరేలా చూస్తామన్నారు. దీనికి ప్రజలు, అన్ని శాఖల అధికారులు సహకరించాలని కోరారు. కలెక్టర్‌ ప్రధమేశ్‌ అర్వింద్‌ రాజశిర్కే మాట్లాడుతూ.. జిల్లా అభివృద్ధికి ఎంతోకృషి చేస్తున్నామన్నారు. మల్కన్‌గిరి జిల్లా అంటే గతంలో అత్యంత దుర్భరంగా ఉండేదన్నారు. అయితే ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయిందన్నారు. మారుమూల గ్రామాలకు సైతం మౌలిక సదుపాయాలు సమకూరాయన్నారు. గిరిజన యువత సైతం విద్య, వైద్య రంగాల్లో రాణిస్తున్నారన్నారు. ఈ సందర్భంగా వివిధ విభాగాల ప్రతినిధులను సత్కరించారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు సోమానాథ్‌ ప్రధాన్‌, వేద్బ్‌ర్‌ ప్రధాన్‌, అభివృధి శాఖ అధికారి దశరాథి సరబు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement