సీజనల్ భయం..
చాలని పాడి రైతులు కోరుతున్నారు.
పశువులకు సక్రమించే వ్యాధులు
చిటుకు వ్యాధి
గొర్రెల్లో చిటుకువ్యాధి అధికంగా వస్తుంది. ఇది బ్యాక్టీరియా వలన వస్తుంది. ఉన్నటుండి గాలిలో ఎగిరి గొర్రెలు చనిపోతాయి. దీని నివారణకు ముందుగా నీరసంగా ఉన్న గొర్రెలను మంద నుంచి వేరుచేయాలి. వ్యాధి నివారణకు పెన్సిలిన్ వేయించాలి. వ్యాధి సోకని వాటికి వ్యాక్సిన్ వేయించాలి.
నీలి నాలుక
నీలి నాలుక గొర్రెలు, మేకల్లో వస్తుంది. ఈ వ్యాధి సోకిన జీవాలకు జ్వరం అధికంగా వస్తుంది. నోటి నుంచి చొంగ కారుస్తూ, గిట్టలకు పుండ్లు ఏర్పడతాయి. ఈ వ్యాధి నివారణకు యాంటీ బయాటిక్స్, లివర్ టానిక్ ఉపయోగించాలి. జీవాలను మంద నుంచి వేరు చేయాలి.
గొంతువాపు వ్యాధి
ఈ వ్యాధి అన్ని వయస్సుల ఆవులు, గేదెల్లో కనిపిస్తుంది. 105 నుంచి 108 డిగ్రీల జ్వరం వస్తుంది. నోటి నుంచి చొంగలు కారి, నోటి నుంచి గాలి పీల్చుకుంటాయి. గొంతవద్ద వాపు వలన మేత తీసుకోలేవు. నివారణకు సల్పాడిమిడిన్ వాడుతూ, 4 నెలలు దాటిన జీవాలకు వ్యాక్సినేషన్ చేయించాలి.
గాలికుంటు వ్యాధి
ఇది అన్ని జీవాల్లో కనిపిస్తుంది. నోటి, గిట్లల్లో పుండ్లు, ఎక్కువగా జ్వరం ఉంటుంది. నివారణకు బోరిక్ గ్లిజరిన్ ఆయింట్‌మెంట్‌ను నోటిలో పూత పూయాలి. పీపీ ద్రావణంతో కాలిగిట్ల మధ్య కడగాలి. ప్రతిఏటా ముందస్తుగా ఏప్రిల్, మే నెలల్లో వ్యాక్సిన్ వేయించాలి.


