కొరాపుట్: దక్షిణ ఒడిశాలో పూరీ క్షేత్రంతో సమానంగా భక్తులు కొలుస్తున్న కొరాపుట్ శబరి శ్రీక్షేత్రంలో రథాల నిర్మాణం ప్రారంభమైంది. శుక్రవారం కొరాపుట్ జిల్లా కేంద్రంలో సునాబెడా రోడ్డులో జాతీయ రహదారిపై జిల్లా కలెక్టర్ సత్యవాన్ మహాజన్ ప్రారంభ పూజలు చేశారు. రానున్న రథయత్ర లోపు ఈ రథాలు నిర్మాణం పూర్తి చేసుకోనున్నాయి. కొరాపుట్‌లో రథయాత్రలో జగన్నాథ, సుభద్ర, బలభద్రలకు వేర్వేరుగా రథాలు నిర్మించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ప్రాంతంలో సవరలు అత్యంత భక్తిశ్రద్ధలో జగన్నాథుడిని కొలుస్తారు.


