స్వస్థలానికి చేరిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము | - | Sakshi
Sakshi News home page

స్వస్థలానికి చేరిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

Jun 20 2026 11:43 AM | Updated on Jun 20 2026 11:43 AM

భువనేశ్వర్‌: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్రానికి చేరారు. రెండు రోజుల ఒడిశా పర్యటన నిమిత్తం రాష్ట్రపతి తన స్వస్థలమైన రాయరంగపూర్‌కు శుక్రవారం విచ్చేశారు. ప్రతికూల వాతావరణం కారణంగా ఆమె విమానంలో కాకుండా రోడ్డు మార్గంలో వచ్చారు. ప్రతికూల వాతావరణం వల్ల రాష్ట్రపతి పర్యటనలో స్వల్ప మార్పుతో ఆలస్యం జరిగింది. నిర్ణీత సమయం కంటే సుమారు 2 గంటలు ఆలస్యంగా స్వస్థలం చేరుకున్నారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం రాష్ట్రపతి హెలికాప్టర్‌ మధ్యాహ్నం 3.45 గంటలకు రాయరంగ్‌పూర్‌లోని దండ్‌ బోస్‌ ఎయిర్‌ స్ట్రిప్‌లో దిగాల్సి ఉంది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా పశ్చిమ బెంగాల్‌లోని కలైకుండలో దిగారు. అక్కడి నుండి రోడ్డు మార్గంలో రాయరంగ్‌పూర్‌ వైపు బయలుదేరారు. రాష్ట్రపతి కాన్వాయ్‌ కలైకుండ నుంచి బయలుదేరి బంగిరిపోషి, బిషోయి మీదుగా రాయరంగపూర్‌లోకి ప్రవేశించింది. రాష్ట్రపతి రెండు రోజుల పర్యటనపై స్థానికుల్లో ఉత్సాహం నెలకొంది. ఆమె పర్యటన ప్రాంతాల్లో భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement