సర్పంచ్‌ల నిరసన | - | Sakshi
Sakshi News home page

సర్పంచ్‌ల నిరసన

Jun 19 2026 1:30 AM | Updated on Jun 19 2026 1:30 AM

పర్లాకిమిడి: ఒడిశాలో కేంద్రపడా జిల్లా తికిరి పంచాయతీలో మహిళా సర్పంచ్‌ చమేలీ ఓజాపై బ్లాక్‌ అధికారులు, పోలీసులు దుర్భాషలాడం, చేయి చేసుకోవడాన్ని నిరసిస్తూ గజపతి జిల్లాలో ఉన్న మహిళా సర్పంచ్‌లు కలెక్టరేట్‌ ఎదుట గురువారం నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఏడీఎం ఫల్గుణి మఝిని కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. బ్లాక్‌ అధికారులు, పోలీసులపై చర్యలు తీసుకోవాలని, లేకుంటే గజపతి జిల్లా 149 పంచాయతీల్లోని సర్పంచ్‌లంతా కలిసికట్టుగా రస్తారోకో, ఆందోళన చేపడతామని జిల్లా సర్పంచ్‌ల సంఘం అధ్యక్షురాలు సంఘమిత్రా శోబోరో అన్నారు. రాయఘడ, గుసాని, నువాగడ, మోహనా, ఆర్‌ఉదయగిరి సర్పంచ్‌లు నిరసనలో పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement