భువనేశ్వర్: రాష్ట్రంలో సేవలు అందిస్తున్న సీనియర్ ఐపీఎస్ అధికారి దయాల్ గంగ్వార్‌ను రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది. హోం శాఖలో ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్‌డీ)గా పని చేస్తున్న దయాల్ గంగ్వార్‌ను ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ సస్పెండ్ చేశారు. బలియంత ప్రాంతంలో సౌమ్యరంజన్ హత్య కేసుకు సంబంధించి ఆ ఐపీఎస్ అధికారి వివాదంలో చిక్కుకున్నారు. ఈ నేపథ్యంలో సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
128 మంది వైద్యులపై క్రమశిక్షణా చర్యలు
భువనేశ్వర్: దీర్ఘకాలంగా విధులకు దూరంగా ఉంటూ ఆస్పత్రులకు గైర్హాజరైన వైద్యులపై ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ కఠిన చర్యలు తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ఆస్పత్రులలో 128 మంది వైద్యాధికారులు, దంత వైద్యులు ఐదేళ్లకు పైగా విధులకు గైర్హాజరైనట్లు గుర్తించారు. ఈ విషయాన్ని వారికి తెలియజేస్తూ వార్తా పత్రికలలో ప్రకటనలు ప్రచురించారు. అనధికారికంగా గైర్హాజరైనందుకు వారిపై క్రమశిక్షణా చర్యలు ప్రారంభించాలని ముఖ్యమంత్రి ఆరోగ్య శాఖను ఆదేశించారు. కొత్త ఆస్పత్రులను ప్రారంభించడం, ఉన్న వాటిని ఆధునీకరించడం, కొత్త వైద్య కళాశాలలను స్థాపించడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య సేవలకు ప్రాధాన్యత కల్పిస్తోందని ముఖ్యమంత్రి అన్నారు. చాలా మంది వైద్యులు నియమితులైన తర్వాత గైర్హాజరవుతూ విధులను నిర్వర్తించడంలో విఫలం అవుతున్నారన్నారు. దీనిని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని ముఖ్యమంత్రి అన్నారు.
పలాస : కాశీబుగ్గలోని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ నుంచి తప్పుడు ధ్రువపత్రాలతో బ్యాంకు రుణాలు పొందిన ఇద్దరి కి పలాస జూనియర్ సివిల్ జడ్జి యు.మాధురి ఏడాది జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారని కాశీబుగ్గ సీఐ వై.రామకృష్ణ చెప్పారు. శ్రీకాకుళం మండలం పాత్రునివలసకు చెందిన కొండల మన్మధరావు, నందిగాం మండలం జడ్యాడ గ్రామానికి చెందిన తమ్మినేని జోగినాయుడు, మరో నలుగురు తప్పుడు పత్రాలు సమర్పించి కాశీబుగ్గ ఏపీజీవీబీ నుంచి వ్యవసాయ పాడి పంటల రుణాలు పొందారు. అప్ప టి బ్యాంకు మేనేజరు పైల కృష్ణారావు ఇచ్చిన ఫిర్యాదు మేర కు కాశీబుగ్గ పోలీసులు కేసు నమోదు చేశారు. నేరం రుజువు కావడంతో ఒక్కొక్కరికిఏడాది జైలు శిక్ష, రూ.2వేలు జరిమా నా విధిస్తూ సివిల్ జడ్జి తీర్పు చెప్పారు. ఈ కేసును పబ్లిక్ ప్రాసిక్యూటర్ పి.రమేష్ వాదనలను వినిపించారు.
గార: ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు నిర్వహించిన యోగా పోస్టర్ రూపకల్పనలో గెలుపొందిన విద్యార్థులకు వమరవల్లి డైట్ ప్రిన్సిపాల్ ఏ.గౌరీశంకరరావు బహమతులు అందజేశారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని జాతీయ జనాభా విద్యా ప్రాజెక్టు ఆధ్వర్యంలో గురువారం జరిగిన జిల్లా స్థాయి పోటీల్లో శ్రీకాకుళం ఏపీఎంజేపీ స్కూల్ టి.గాయత్రి ప్రథమస్థానం, వప్పంగి జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థిని డి.ఉష ద్వితీయ, టెక్కలి ఏపీఎంజేపీ పాఠశాల విద్యార్థిని పి.జ్యోత్స్న తృతీయ స్థానంలో నిలిచారు. వీరికి సర్టిఫికెట్‌తో పాటు నగదు బహుమతులు అందజేసారు. పోటీలను జిల్లా విద్యాశాఖాధికారి ఏ.రవిబాబు పరిశీలించారు. కార్యక్రమంలో యోగా జిల్లా కో ఆర్డినేటర్ ఎస్.ప్రసాద్, పి.కృష్ణ పాల్గొన్నారు.


