పర్లాకిమిడి: వేసవి సెలవులు పూర్తయి తిరిగి గజపతి జిల్లాలో అన్ని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, కళాశాలలు తిరిగి ప్రారంభం అవ్వడంతో డీఈఓ మయాధర్ సాహు ఆదేశాల మేరకు మాండేటరీ బయోమెట్రిక్ అప్‌డేట్ (యం.బి.యు) కార్యక్రమం 5 నుంచి 17 ఏళ్ల వయస్సు గల విద్యార్థులకు గురువారం నిర్వహించారు. రాణిపేట (కాశీనగర్ బ్లాక్), గుసాని సమితి జాజిపూర్ ప్రభుత్వ యు.జి. పాఠశాలల్లో బయోమెట్రిక్ అప్‌డేట్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి యు.ఐ.డి.ఏ.ఐ. (యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ అధార్) భువనేశ్వర్ నుంచి విచ్చేసిన అసిస్టెంట్ మ్యానేజరు అధర్స్ పట్నాయక్, ఆధార్ జిల్లా మ్యానేజరు పి.శ్యాం కుమార్, బ్లూమ్స్ సోల్యూషన్, రాణిపేట ప్రభుత్వ యు.జి. స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు దుర్గాసి శ్రీరామ్మూర్తి, కాశీనగర్ బ్లాక్ సి.ఆర్.సి.సి. ప్రదీప్ కుమార్ పలక, జాజిపూర్ ప్రాథమిక ఉన్నత పాఠశాల హెచ్‌ఎం సిద్ధార్థ్ శంకర్ పతి, మోహన్ కుమార్ నాయక్‌లు పాల్గొన్నారు. ఈ యం.బి.యు కార్యక్రమం జూన్ 22 నుంచి తిరిగి అన్ని పాఠశాలల్లో ప్రారంభమవుతుంది.


