సమితి కార్యాలయం ముట్టడి | - | Sakshi
Sakshi News home page

సమితి కార్యాలయం ముట్టడి

Jun 19 2026 1:30 AM | Updated on Jun 19 2026 1:30 AM

రాయగడ: అర్హులైన వారికి పెన్షన్‌ మంజూరు చేయాలని, లబ్ధిదారులకు గత మూడు నెలలు పెన్షన్‌ అందించాలని బహుజన్‌ సమాజ్‌ పార్టీ నాయకులు గురువారం జిల్లాలోని బిసంకటక్‌ సమితి కార్యాలయాన్ని ముట్టడించారు. వందలాది మంది కార్యకర్తలు ఈ ఆందోళనలో పాల్గొని రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేక విధానాలను ఎండగట్టారు. గత మూడు నెలలుగా పెన్షన్‌ కోసం కాళ్లరిగేలా సమితి కార్యాలయానికి, బ్యాంకులకు తిరిగినా పట్టించుకునే నాథుడే కరువయ్యాడని పార్టీ జిల్లా అధ్యక్షుడు పూర్ణ చంద్ర టకిరి అన్నారు.

ప్రభుత్వం ఇప్పటికై నా చొరవ తీసుకుని గత మూడు నెలలుగా బకాయి ఉన్న పెన్షన్‌ను తక్షణమే అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. లేదంటే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామన్నారు. అంతకు ముందు బిసంకటక్‌లో ర్యాలీగా సమితి కార్యాలయానికి చేరుకున్నారు. ఈ ఆందోళనలో బీఎస్పీ నాయకులు రామదాస్‌ టక్రీ, శివ ప్రస్కా, భీమా పిడిక, నీలాంచల్‌ హిమిరిక, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement