జాతీయ స్కిడ్‌ స్కేటింగ్‌లో ఐదుగురికి కాంస్య పథకాలు | - | Sakshi
Sakshi News home page

జాతీయ స్కిడ్‌ స్కేటింగ్‌లో ఐదుగురికి కాంస్య పథకాలు

Jun 19 2026 1:30 AM | Updated on Jun 19 2026 1:30 AM

పర్లాకిమిడి: జాతీయ స్కిడ్‌ స్కేటింగ్‌ చాంపియన్‌షిప్‌–2026 కోల్‌కోతాలో జరిగిన పోటీలలో గజపతి జిల్లా స్కేటర్స్‌ ఐదు కాంస్య పతకాలు సాధించారు. గురువారం విజేతలు రాజ్యరాణి ఎక్స్‌ప్రెస్‌లో పర్లాకిమిడి చేరుకున్నారు. పశ్చిమ బెంగాల్‌ కోల్‌కోత్తాలో రోలర్‌ స్కేటర్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా ద్వారా ఈనెల 12 నుంచి 15 వరకూ జరిగిన ఓపెన్‌ నేషనల్‌ స్కేటింగ్‌ చాంపియన్‌ షిప్‌ పోటీలలో గజపతి జిల్లా పర్లాకిమిడికి చెందిన స్కిడ్‌ స్కేటర్స్‌ అత్యంత ప్రతిభ చూపించారు. ఐదు కాంస్య పఽథకాలు 6 స్థానాల్లో సాధించారు.

విజేతలు వీరేః– బోరోణ్య రయితో, సీనియర్‌ విభాగం, 100 మీటర్లలో కాంస్య పఽథకం, తెంబూరు రితీష, 10వేల మీటర్లు విభాదం (15 – 18 ఏళ్లు) కాంస్య పథకం, బిశ్వాస్‌కుమార్‌ గౌడోలో కాంస్య పథకం 750మీటర్ల స్కేటింగ్‌లో సాధించారు. ఇవికాక మరో ముగ్గురు ఆటగాళ్లు పి.కార్తీక్‌, సాంభవీ సాహు, పి.ధమేష్‌లకు జూనియర్‌ విభాగంలో నాలుగు, ఆరు స్థానాల్లో నిలిచారని ప్రశిక్షకులు సుకాంత్‌ దలబెహారా తెలియజేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement