జయపురం : కొరాపుట్ ఆదివాసీలకు 12 నెలల్లో 13 పండగలు అన్నది నానుడి. జయపురం సమితి కుడిపి గ్రామంలో కుడిపి గ్రామంలో గ్రామ దేవతకు కొత్త మందిరం నిర్మించిన సందర్భంగా ఆ గ్రామంలో ఉత్సవ వాతావరణం నెలకొంది. గ్రామస్తులతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా జయపురం ఎమ్మెల్యే తారాప్రసాద్ బాహిణీపతి పాల్గొని ప్రజల్లో తానూ ఒకరై భజనలు చేశారు. గ్రామ దేవతకు సంప్రదాయ పూజలు జరిపారు. గ్రామ దేవత గంగదేయి ఠకురాణి నూతన మందిర ప్రతిష్టాపన మహోత్సవాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో నిర్వహించిన అష్ట్రపహరీ నామయజ్ఞ కార్యక్రమంలో ఆయన పాల్గొని భక్తులను ఉత్సాహ పరచారు. అమ్మవారికి భక్తితో ఘనంగా పూజలు చేశారు. ఈ సందర్బంగా తాను ప్రసంగిస్తూ ఈ పూజలు, పండగలు మన పూ ర్వీకులు మనకు అందించిన గొప్ప వరాలన్నారు. వాటిని పరిరక్షించుకుంటామని అన్నారు.


