ఆరోగ్య మంత్రికి తప్పిన ప్రమాదం | - | Sakshi
Sakshi News home page

ఆరోగ్య మంత్రికి తప్పిన ప్రమాదం

Jun 19 2026 1:12 AM | Updated on Jun 19 2026 1:12 AM

భువనేశ్వర్‌: రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్‌ ముఖేష్‌ మహాలింగ్‌కు త్రుటిలో ఘోర ప్రమాదం తప్పింది. ఆయన మయూర్‌భంజ్‌కు వెళ్తుండగా 49వ నంబరు జాతీయ రహదారిపై తెల్‌కోయి జగ్‌మోహన్‌ పూర్‌ సమీపంలో ఒక ప్రమాదం జరిగింది. ముందున వెళ్తున్న పైలట్‌ కారు అకస్మాత్తుగా బ్రేకులు వేయడంతో వెనుక నుంచి వస్తున్న మంత్రి కారు బలంగా ఢీకొంది. కారు ముందు భాగం నుజ్జు అయింది. అదృష్టవశాత్తు మంత్రి ప్రాణాలతో బతికి బయటపడగలిగారు. అనంతరం ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి మరో వాహనంలో మయూర్‌భంజ్‌కు వెళ్లారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement