వర్షాకాలంలో
● జయపురం సిటిజన్ కమిటీ విజ్ఞప్తి
జయపురం: వర్షా కాలంలో సంభవించే తుఫా న్లను దృష్టిలో పెట్టుకొని ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని జయపురం సిటిజన్ కమిటీ సభ్యులు మున్సిపల్ అధికారులకు విజ్ఞప్తి చేశారు. స్థానిక శిర్డీసాయినగర్‌లోని సిటిజన్ కమిటీ కార్యాలయంలో కమిటీ అధ్యక్షురాలు బినోదిణి సాంతపా త్రో అధ్యక్షతన సభ్యులు సమావేశమయ్యారు. ముందుగా కార్యదర్శి జి.వెంకటరెడ్డి ,గత తీర్మానాలు.. వాటి అమలుకు చేపట్టిన చర్యలు వివరించారు. అనంతరం పట్టణ సమస్యలపై చర్చించారు. వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా పట్టణంలో పెద్దచెట్ల కొమ్మలు నరకి వేయాలని, కాలువల్లో పూడికలు తొలగించాలని, రాత్రి వేళల్లో కూడా పోస్టాఫీసు, పోస్టాఫీస్‌లోని రైల్వే టికెట్ బుకింగ్ కౌంటర్ తెరవాలని, పూరీ–కొరాపుట్ రైలును జయపురం వరకు నడపాలని, జయపురం ప్రధాన రోడ్లలో ఆధునిక మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని కోరారు. ప్రతి సభ్యుడు నెల చందా చెల్లించాలని సమావేశ విజ్ఞప్తి చేసింది. సమావేశంలో కార్యనిర్వాహక సభ్యులు సత్యబాన్ పండ, పరమేశ్వర పాత్ర, యాదవ సుబుద్ధి రత్నాకర చౌధురి, కమిటీ మాజీ అధ్యక్షులు మీన కేతన దాస్, ఉభాష్ పండ, రబినారాయణ నందో, జయపురం దేవోత్తర కమిటీ అధ్యక్షులు దేవేంద్ర బాహిణీపతి, భీమ్‌సేన్ అగర్వాల్, తులసీ రావు, రామనాథ్ పండ పాల్గొన్నారు.


