వృద్ధులను గౌరవించాలి | - | Sakshi
Sakshi News home page

వృద్ధులను గౌరవించాలి

Jun 18 2026 12:23 AM | Updated on Jun 18 2026 12:23 AM

భువనేశ్వర్‌: వయోవృద్ధులను గౌరవించడం కుటుంబ సంస్కరణను ప్రతిబింబిస్తుందని హైటెక్‌ గ్రూప్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్‌ తిరుపతి పాణిగ్రాహి అన్నారు.వృద్ధులు సమాజానికి నాయకులని, వారిని నిర్లక్ష్యం చేయడం సమాజాన్ని నిర్లక్ష్యం చేయడమేనని భువనేశ్వర్‌ లోక్‌సభ సభ్యురాలు అపరాజిత షడంగి అన్నారు. ఒడిశా రాష్ట్ర వయోవృద్ధుల సంఘం భువనేశ్వర్‌, హైటెక్‌ మెడికల్‌ కాలేజ్‌ అండ్‌ హాస్పిటల్‌ సంయుక్త సహకారంతో ప్రపంచ వయోవృద్ధుల వేధింపుల నివారణ అవగాహన దినోత్సవం బుధవారం నిర్వహించారు. ఒడిశా వయోవృద్ధుల సమాఖ్య అధ్యక్షుడు మధుమాధవ్‌ జెనా ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సమాజంలో వృద్ధుల పట్ల పెరుగుతున్న నిర్లక్ష్యం, వేధింపులను ఎలా నివారించాలి, వారికి సురక్షితమైన, గౌరవప్రదమైన జీవితాన్ని ఎలా అందించాలి అనే అంశంపై మేధావులు, సభ్యులు చర్చించారు. సమాజంలో వయోవృద్ధుల భద్రత, హక్కుల పరిరక్షణ పట్ల విస్తృత అవగాహన కల్పించేందుకు ఒడిశా రాజ్య వయోవృద్ధుల మహాసంఘ్‌, హై టెక్‌ మెడికల్‌ కాలేజ్‌ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి. కార్యక్రమంలో డాక్టర్‌ శ్వేతా దాస్‌, డాక్టర్‌ సంగీతా అగర్వాల్‌, మాజీ ఎమ్మెల్యే ప్రియదర్శి మిశ్రా, రుద్ర సామంత్రాయ్‌, జుయెల్‌ కిషోర్‌ దాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement