వైద్యుల నిర్లక్ష్యానికి గర్భిణి మృతి | - | Sakshi
Sakshi News home page

వైద్యుల నిర్లక్ష్యానికి గర్భిణి మృతి

Jun 18 2026 12:23 AM | Updated on Jun 18 2026 12:23 AM

మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా ఎం.వి.21 గ్రామానికి చెందిన బందన మండాల్‌ (30) అనే గర్భిణి వైద్యుల నిర్లక్ష్యం కారణంగా బుధవారం మృతి చెందింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో బందనకు కడుపు నొప్పి రావడంతో వాంతులయ్యాయి. ఆమె ఉంటున్న గదిలోనే విష సర్పం ఉండటాన్ని కుటుంబ సభ్యులు గమనించి వెంటనే పామును చంపేశారు. అనంతరం బందనను మల్కన్‌గిరి ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు వాంతులు తగ్గేందుకు మాత్రమే మందులు ఇచ్చారు తప్ప పాము కాటు వేసిన విషయాన్ని పట్టించుకోలేదు. బుధవారం ఉదయానికి పరిస్థితి విషమించడంతో బందన మృతిచెందింది. ఇందుకు వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ డాక్టర్‌పై దాడి చేశారు. విషయం తెలుసుకున్న మల్కన్‌గిరి పోలీసు ఐఐసీ రీగాన్‌కీండో ఆస్పత్రిని చేరుకుని పరిస్థితి చక్కదిద్దారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement