పర్లాకిమిడి: గజపతి జిల్లాలో కాశీనగర్ బ్లాక్ బూదర పంచాయతీలో పర్లాకిమిడి ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి బుధవారం గ్రీవెన్స్ సెల్‌ను ఏర్పాటు చేశారు. ప్రజావినతుల కార్యక్రమానికి జిల్లా పరిషత్ అధ్యక్షుడు గవర తిరుపతిరావు, కాశీనగర్ సమితి చైర్‌పర్సన్ బల్ల శాయమ్మ తదితరులు హాజరయ్యారు. మొత్తం 23 వినతులు ఎమ్మెల్యేకు అందాయి. వాటిలో ముఖ్యంగా రేష న్ కార్డులు, రోడ్లు, గృహానిర్మాణాలు (పి.ఎం.ఎ.వై), పలు సమస్యలు ఆయన దృష్టికి వచ్చాయి. వీటిని కాశీనగర్ బీడీఓ డంబుధర మల్లిక్‌కు ఫోన్ చేసి పరిష్కరించాలని ఎమ్మెల్యే కోరారు.


