వైభవంగా ధ్యాన మందిరం ప్రారంభోత్సవం | - | Sakshi
Sakshi News home page

వైభవంగా ధ్యాన మందిరం ప్రారంభోత్సవం

Jun 18 2026 12:17 AM | Updated on Jun 18 2026 12:17 AM

రాయగడ: స్థానిక డైలీ మార్కెట్‌లో గల ధ్యానాంజనేయ మందిరం ప్రాంగణంలో నిర్మించిన శ్రీకృష్ణ ధ్యానమందిరం ప్రారంభోత్సవం బుధవారం ఘనంగా నిర్వహించారు. ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త శ్రీచైతన్య రాంజీ నేతృత్వంతో ప్రత్యేక పూజా కార్య క్రమాలను చేపట్టారు. విగ్రహ, మందిర ప్రతిష్ట కార్యక్రమాలు జరిగాయి. ఉదయం విష్ణు సహస్రనామాల పారాయణం, జలాభిషేకం తదితర పూజలను చేపట్టారు. సీర అప్పయ్యమ్మ, సీర పోలయ్యల జ్ఞాపకార్థం ఈ మందిరాన్ని నిర్మాంచారు. రాజ్యసభ మాజీ ఎంపీ నెక్కంటి భాస్కరావు, తదితర ప్రముఖులు మందిరాన్ని సందర్శించి శ్రీకృష్ణ పరమాత్ముని ఆశీర్వచనాలు పొందారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement