పర్లాకిమిడి: గజపతి జిల్లా మోహనా సరస్వతీ శిశు విద్యామందిర్ పర్యవేక్షణ సమితి సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. పర్యవేక్షణ సమితి అధ్యక్షులు బికారీ చరణ్‌బెహరా అధ్యక్షతన సమావేశం జరిగింది. పాఠశాల అభివృద్ధిపై చర్చించారు. ఈ విద్యా సంవంత్సరంలో విద్యార్థులకు మెరుగైన విద్య, ఉపాధ్యాయుల బాధ్యయుత శిక్షణ, మెట్రిక్ పరీక్ష ఫలితాల మెరుగుకు కృషి చేయాలని బెహరా అన్నారు. విద్యాలయంలో తరగతి గదుల అభివృద్ధి పనులు కూడా జరిగేలా చూడాలని అధ్యక్షులు సూచించారు. ఈ సమావేశంలో పర్యవేక్షణ కమిటీ సభ్యులు పూర్ణచంద్ర దోళాయి, మధుసూదన పాడీ, బృందావన సామంతరాయ్, ఉపాధ్యక్షులు కేదార్ పట్నాయక్, సహా కార్యదర్శి బబులా సెఠి, కోశాధికారి జిత్తు మిశ్రా, అజిత్ పాత్రో, ప్రధాన ఉపాధ్యయులు ఆరతీ పాడీ, సుధాంశు శేఖర్ పాణిగ్రాహి పాల్గొన్నారు.


