రొజ్జో ఉత్సవం | - | Sakshi
Sakshi News home page

రొజ్జో ఉత్సవం

Jun 16 2026 1:28 AM | Updated on Jun 16 2026 1:28 AM

న్యూస్‌రీల్‌

మంగళవారం శ్రీ 16 శ్రీ జూన్‌ శ్రీ 2026
ఉత్సాహంగా..

పర్లాకిమిడి: రొజ్జో పండుగ ఒక ధరిత్రి ఉత్సవం. పెళ్లి కాని పడతులు కాళ్లకు పారాణి వేసుకుని భూదేవికి ఎలాంటి ఆటంకం కలుగకుండా పాదాలకు అరటి ఆకులు కట్టుకుని భూమి మీద నడుస్తారు. సోమవారం ప్రగతి మహిళా సంఘటన్‌ ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం రాజావారి ప్యాలస్‌లో యుటెక్‌ కంప్యూటర్‌ కార్యాలయంలో రొజ్జోత్సవం ఘనంగా జరుపుకున్నారు. ఈ ఉత్సవానికి ఆర్‌.ఉదయగిరి సబ్‌ డివిజనల్‌ పోలీసు అధికారి రాజేష్‌ కుమార్‌ సాహు ముఖ్యఅతిథిగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. ఇతర అతిథులుగా నిర్మలా పట్నాయిక్‌ (రామగిరి), భాగవత్‌ పాఢి, బిచిత్రానంద బెబర్తా ముఖ్య వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఈ సందర్భంగా ఎస్‌డీపీఓ రాజేష్‌ కుమార్‌ సాహు మాట్లాడుతూ, ఒడియా సంస్కృతి, ఒడియా ఐటెంటిటీ ఈ రొజ్జో పండుగలో కనిపిస్తుందని అన్నారు. క్విజ్‌, రచన, చిత్రలేఖనం పోటీలలో విజేతలకు ఈ సంధర్బంగా పోలీసు అధికారి రాజేష్‌కుమార్‌ సాహు బహుమతి ప్రదానం చేశారు.

రాయగడ: ఒడిశా సంసృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచిన పండగల్లో ఒకటైన రొజ్జొ వేడుకలు జిల్లాలో సందడిగా జరిగాయి. రామనగుడ సమితి పరిధిలోని పలు గ్రామాల్లో ఒడిశా సంప్రదాయ పండగగా గుర్తింపు పొందిన రొజ్జో ఉత్సవాలను ఘనంగా ప్రజలు జరుపుకున్నారు. వివిధ ప్రాంతాల్లో జానపద నృత్యాలు, ఆటపాటలను నిర్వహించడంతో పండగకు మరింత శొభ చేకూరింది.

భారీ పొడాపిఠా ప్రదర్శన

రాయగడ: ఒడిశా ప్రజల సంప్రదాయ పండగల్లో ఒకటిగా గుర్తింపు పొందిన రొజ్జో పర్వదినాన్ని పురష్కరించుకుని భువనేశ్వర్‌ లొని జయదేవ్‌ భవన్‌ పార్కింగ్‌ ప్రాంగణంలో 1.80 క్వింటాళ్ల బరువుతొ భారీ పొడాపిఠాను తయారు చేసి ప్రదర్శించారు. ఒడియా సంప్రదాయ ఆహార సంసృతి, ప్రజా వారసత్వాన్ని పరిరక్షించి యువతకు పరిచయం చేయాలనే లక్ష్యంతో ఈ వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement