భారీ మావో డంప్‌ స్వాధీనం | - | Sakshi
Sakshi News home page

భారీ మావో డంప్‌ స్వాధీనం

Jun 16 2026 1:28 AM | Updated on Jun 16 2026 1:28 AM

మల్కన్‌గిరి : మల్కన్‌గిరి జిల్లా పోడియ సమితి సీలకోట, పెరువాయి, కేస్కాగూఢ గ్రామ అడవిలో ఆదివారం నుంచి డీవీఎఫ్‌ జవాన్లు కూంబింగ్‌ చేస్తున్నారు. సోమవారం తెల్లవారుజామున 6గంటలు సమయంలో జవాన్లు తిరిగి వస్తుండగా పెరువాయి గ్రామ సమీపంలో ఓ చోట మావోల డంప్‌ను గుర్తించి వెలికి తీశారు. అందులో మూడు స్టెన్‌ కార్బైన్లు, ఒక దేశీయ పిస్టల్‌, ఒక ఎస్‌భీఎంఎల్‌ తుపాకీ, ఒక దెబ్బతిన్న 12 బోర్‌తుపాకీ, 5 ఐఈడీలు, 20 యూబీజీఎల్‌ గ్రనేడ్లు, 53 రౌండ్లు, 12 బోర్‌ తూటాలు, ఒక స్పైపర్‌ టెలిస్కోప్‌, బ్యాటరీలు, సోలార్‌ ప్యానెల్‌, మల్టీమీటర్‌, వెల్డింగ్‌ యంత్రం, వైర్లుకట్టర్‌, మావో దూస్తులు ఇతర వస్తువులను జవాన్లు స్వాధీనం చేసుకున్నారు. సాయంత్రం ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వినోద్‌ పటేల్‌ ఈ సామగ్రిని ప్రదర్శించారు. ఆయన మాట్లాడుతూ ముందుగా జవాన్లను అభినందించారు. ఈ డంప్‌ ఆంధ్రా–ఒడిశా స్పెషల్‌ జోనల్‌ కమిటీ మావోయిస్టులకు చెందినవని గుర్తించారు. ఎస్‌ఓజీ, డీవీఎఫ్‌ జవాన్లు క్రమం తప్పకుండా కూంబింగ్‌లు నిర్వహించి మావోల ఉనికి పూర్తిగా లేకుండా చేయాలని కేంద్రం ఆదేశించిందని, దానికి అనుగుణంగా పనిచేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ రాజ్‌కిషోర్‌ దాస్‌, డీవీఎఫ్‌ జవాన్లు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement