బాలికల అక్రమ రవాణా అడ్డగింత! | - | Sakshi
Sakshi News home page

బాలికల అక్రమ రవాణా అడ్డగింత!

Jun 15 2026 4:28 AM | Updated on Jun 15 2026 4:28 AM

బాలికల సంరక్షణ కేంద్రానికి తరలించిన పోలీసులు

కొరాపుట్‌: వేర్వేరు చోట్ల బాలికల అక్రమ రవాణాను నబరంగ్‌పూర్‌ జిల్లా పోలీసులు అడ్డుకున్నారు. జిల్లాలోని డాబుగాం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఐదుగురు మైనర్‌ బాలికలతో పాటు నలుగురు మహిళలు మల్కన్‌గిరి జిల్లా వెళ్లడానికి ప్రయత్నిస్తున్నట్టు పోలీసులకు సమాచారం వచ్చింది. దాంతో వారు ప్రధాన జంక్షన్‌ వద్ద కాపు కాసి వారిని అదుపులోనికి తీసుకున్నారు. వీరంతా మల్కన్‌గిరి జిల్లా మీదుగా ఇతర రాష్ట్రాలకు వెళ్లాలనే ప్రయత్నంలో ఉన్నారని పోలీసులు పేర్కొన్నారు. అలాగే జొరిగాం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో మరో ముగ్గులు బాలికలను తరలిస్తున్న ముఠా పట్టుబడింది. ఈ బాలికలు హైదరాబాద్‌ వెళ్లాల్సి ఉందని పోలీసులు పేర్కొన్నారు. వీరందరిని బాలికల సంరక్షణ కేంద్రానికి తరలించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement