భాగవత పారాయణం
జయపురం:
జయపురం ఆధ్యాత్మిక ప్రాణ కేంద్రం గీతా భవనంలో భాగవత పారాయణం, హోమం, నాలుగు ప్రహర నామ యజ్ఞ కార్యక్రమాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. పట్టణంలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని మరింత సుసంపన్నం చేసేందుకు, లోక కల్యాణం, ప్రపంచశాంతి ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమం చేపడుతున్నట్టు నిర్వాహకులు వెల్లడించారు. జయపురం భక్త సమాజం ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న ధార్మిక మహ్సోవంలో భక్తుల కోసం పవిత్ర ఒడియా భాగవత పారాయణం, హోమాలు, ప్రవచనాలు ఏర్పాటు చేస్తున్నట్టు పేర్కొన్నారు. స్థానిక ప్రజలకు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ప్రసిద్ధ పండితులు, ప్రవచరణకారులు పాల్గొని భాగవత కథామృతం వినిపిస్తారన్నారు. అలాగే విరామం లేకుండా జరిగేనాలుగు ప్రహర నామ యజ్ఞ, హరినామ సంకీర్తనలు ప్రజలను మంత్ర ముగ్దుల్ని చేస్తాయని, వివిధ ప్రాంతాల నుండి వచ్చి పాల్గొనే సంకీర్తన బృందాలు ‘హరే కృష్ణ’మహా మంత్ర ధ్వణితో ప్రజలను తరింప చేస్తాయని తెలిపారు. ఉత్సవాలు సజావుగా నిర్వహించేందుకు గీతా భవన్ యాజమాన్య వారు ఒక కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ సభ్యుల భక్తులకు ప్రసాద సేవనం, క్రమబద్ధంగా దర్శనం చేసుకొనేందుకు, యజ్ఞ దర్శనాలకు జరుపు కొనేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు చెప్పారు. నాలుగు ప్రరహర నామ యజ్ఞాలను గురురత్నాకర నారద, కృష్ణ చంద్రబాబు లు నిర్వహిస్తారని వెల్లడించారు.


