జయపురం:
జయపురం సబ్ డివిజన్ కోట్‌పాడ్‌లో ఒడిశా ప్రభుత్వ సామాజిక సురక్షా, దివ్యాంగ స్వశక్త్కీరణ విభాగం ద్వారా 24 మంది చెవిటి వారికి హియరింగ్ యంత్రాలను అందజేశారు. కోట్‌పాడ్ పంచాయతీ కార్యాలయంలో చెవిటి, మూగ వ్యక్తులకు శ్రవణ యంత్రాలు అందజేశారు. కోట్‌పాడ్ బీడీవో సంధ్యారాణి సమరత్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రూపు భొత్ర ముఖ్య అతిథిగా పాల్గున్నారు. ఆయన చేతులమీదుగా 24 మందికి శ్రవణ యంత్రాలు అందజేశారు. కార్యక్రమంలో నవరంగపూర్ ఎంపీ కోట్‌పాడ్ ప్రతినిధి బినాయక ఆచార్య, కోట్‌పాడ్ ఎమ్మెల్యే ప్రతినిధి సురెన్ మహంతి తదితరులు పాల్గొన్నారు.


