పోలీసుల ఆకస్మిక దాడులు | - | Sakshi
Sakshi News home page

పోలీసుల ఆకస్మిక దాడులు

Jun 15 2026 4:22 AM | Updated on Jun 15 2026 4:22 AM

పర్లాకిమిడి: గజపతి జిల్లా ఎస్పీ మీనా ఆదేశాల మేరకు పర్లాకిమిడి ఆదర్శ పోలీసుస్టేషన్‌ సిబ్బంది, డి.వి.ఎఫ్‌, ఎ.పి.ఆర్‌. పోలీసులు బృందం ప్రధాన రహదారిలో ఫుట్‌ మార్చ్‌ చేపట్టారు. ఈ మార్చ్‌ జరుపుతున్నప్పుడు సందేహాం కలిగిన ప్రదేశాలల్లో సెర్చ్‌ జరిపారు.

ఈ దాడుల్లో పేకాట శిబిరంలో ఎనిమిది మందిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ. 2,335 నగదు, ఎనిమిది మొబైల్స్‌ స్వాధీనం చేసుకున్నారు. అలాగే రెల్లి వీధిలో జరిపిన దాడుల్లో అక్రమ సారా బెల్టుషాపులుపై దాడులు జరిపి 24 బీర్‌ బాటిళ్లు, ఒక నిందితున్ని అరెస్టు చేశారు. అలాగే మోటారు సైకిల్‌పై ఇద్దరు వ్యక్తులు 20 లీటర్ల సారా రవాణా చేస్తుండగా వారిని పట్టుకుని అరెస్టు చేశారు. ఈ దాడులు గత రెండు రోజుల నుంచి వరుసగా జరుపుతున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement