25 కిలోల గంజాయి పట్టివేత | - | Sakshi
Sakshi News home page

25 కిలోల గంజాయి పట్టివేత

Jun 14 2026 10:07 AM | Updated on Jun 14 2026 10:07 AM

ఇద్దరు అరెస్టు

మల్కన్‌గిరి: మల్కన్‌గిరి సమితి చంపాఖారి చెక్‌పోస్టు వద్ద శుక్రవారం రాత్రి పోలీసులు పెట్రోలింగ్‌ నిర్వహిస్తుండగా బైక్‌పై అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరు యువకులు పట్టుబడ్డారు. వారిని తనిఖీ చేయగా రెండు బస్తాల్లో గంజాయిని గుర్తించారు. దీంతో గంజాయిని స్వాధీనం చేసుకొని ఇద్దరిని అరెస్టు చేసి మల్కన్‌గిరి పోలీసుస్టేషన్‌కు తరలించారు శనివారం గంజాయిని తూకం వేయగా 25 కిలోలు ఉన్నట్టు నిర్ధారించారు. దీని విలువ మూడు లక్షల రూపాయలు ఉంటుందని ఐఐసీ రీగాఆన్‌కీండో తెలిపారు. నిందితులు ఛత్తీస్‌గడ్‌ రాష్ట్రం సుకుమా జిల్లాకు చెందిన వ్యక్తులు తెలిసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement