బీజేపీ జన్‌ ఆక్రోష్‌ మహిళా ర్యాలీ | - | Sakshi
Sakshi News home page

బీజేపీ జన్‌ ఆక్రోష్‌ మహిళా ర్యాలీ

Apr 23 2026 8:12 AM | Updated on Apr 23 2026 8:12 AM

బీజేపీ జన్‌ ఆక్రోష్‌ మహిళా ర్యాలీ

భువనేశ్వర్‌: స్థానిక ప్రదర్శన మైదానం నుంచి రామ మందిరం కూడలి గుండా దిగువ పీఎంజీ వరకు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో బుధవారం భారీ ‘జన్‌ ఆక్రోష్‌ మహిళా పాదయాత్ర‘ బుధవా రం నిర్వహించారు. ఈ యాత్రలో పాల్గొన్న మహిళలు నల్లని వస్త్రధారణతో ప్రతిపక్షాల వ్యతిరేక నినాదాలతో పరిసరాల్ని హోరెత్తించారు. దిగువ పీఎంజీ ప్రాంతంలో మహిళా బిల్లు ఆమోదం వ్యతిరేకించిన నాయకుల దిష్టి బొమ్మలను దహనం చేశారు. అనంతరం బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో ముఖ్యమంత్రి మోహన్‌ చరణ్‌ మాఝి, ఉప ముఖ్యమంత్రులు కనక్‌ వర్ధన్‌ సింగ్‌ దేవ్‌, ప్రభాతి పరిడా, మంత్రులు పృథ్వీరాజ్‌ హరిచందన్‌, రవి నాయక్‌, నిత్యానంద్‌ గోండ్‌, గోకులానంద్‌ మల్లిక్‌, లోక్‌సభ సభ్యుడు ప్రతాప్‌ చంద్ర షడంగి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement