న్యూస్‌రీల్
శనివారం శ్రీ 18 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026
‘ఆదివాసీలపై..
పర్లాకిమిడి:
రాయగడ జిల్లాలో వేదాంత ప్రతిబాదిత బాక్సైట్ కంపెనీ కోసం సజ్జిమల్లి పర్వతం ఆదివాసీలను బెదిరించి అరెస్టు చేయడాన్ని ఖండిస్తూ శుక్రవారం ఆల్ ఇండియా కిసాన్ మజ్దూర్ సభ, సీపీఐ (ఎం.ఎల్.) న్యూ డెమాక్రసీ, సి.పి.ఐ.(ఎం.ఎల్) తదితరులు కలిసి ప్రతిబాద్ సభ జరిపారు. తొలుత హైస్కూల్ జంక్షన్ నుంచి ర్యాలీగా ఆదివాస్ మంచ్, వామపక్షాలు, న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వరకూ ర్యాలీ జరిపారు. అనంతరం అఖిల భారత కిసాన్ మజ్దూర్ సభ, సీపీఐ(ఎం.ఎల్) న్యూ డెమోక్రసీ, జిల్లా కార్యదర్శి కేదార్ శోబోరో ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ఆందోళన జరిపారు. వేదాంత కంపెనీ బాకై ్సట్ తవ్వకాల కోసం అనేక గిరిజన ఆదివాసీ గ్రామాలు రాయగడ జిల్లా సజ్జిమల్లి, కంటామల్లి గ్రామంలో గ్రామసభ రికార్డులు నకిలీవి సృష్టించి, అటవీ భూముల హక్కులు కాలరాసి ఫారెస్టు హక్కుల చట్టం 2006, పెసా చట్టం 1996 ఉల్లంఘనకు పాల్పడి అనేక బాకై ్సట్ గనులు స్వాధీనం చేసుకోవాలని ఆదివాసీలపై బినామీ కేసులు బనాయించి అర్ధరాత్రి వారిపై దాడులు జరిపారని, దీనికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు మెమొ రాండమ్ ఇచ్చామని, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రాయగడ సజ్జిమల్లి సంఘటనపై నిరసన తెలుపుతున్నామని కేదార్ శోబోరో అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ మఝి ప్రభుత్వం ఏప్రిల్ 6–7 సజ్జిమల్లి, కళాహాండి సంఘటనలపై చర్యలు తీసుకుని ఆదివాసీ భూహక్కులు కాపాడాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు కలెక్టరేట్‌లో వామపక్ష పార్టీల నాయకులంతా కలిసి ఏడీఎం (రెవెన్యూ) మునీంద్ర హానగకు రాష్ట్రపతికి రాసిన ఒక వినతిని అందజేశారు. ఈ ఆందోళనలో సీపీఐ (యం.ఎల్) లిబరేషన్ నాయకులు శ్రీనివాస బెహరా, శాంసన్ గోమాంగో తదితరులు పాల్గొన్నారు.


