ఘనంగా నివాళులర్పించిన బీజేడీ పార్టీ శ్రేణులు
జయపురం: ఒడిశా మాజీ ముఖ్యమంత్రి జయానంద పట్నాయక్ (బిజూ పట్నాయక్) ఆదర్శనీయులని వక్తలు కొనియాడారు. ఆయన 29వ వర్ధంతి కార్యక్రమాన్ని జయపురం బీజేడీ పార్టీ శ్రేణులు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. మాజీ మంత్రి, రాష్ట్ర బీజేడీ ఉపాధ్యక్షులు రబినారాయణ నందో నేతృత్వంలో అధికసంఖ్యలో నాయకులు, కార్యకర్తలు జయపురం పట్టణ పోలీసుస్టేషన్ సమీపంలోని బిజూ పట్నాయక్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో రబినారాయణ నందో మాట్లాడుతూ.. బిజూ బాబు ముఖ్యమంత్రిగా, కేంద్రమంత్రిగా, ప్రజా నేతగా రాష్ట్ర ప్రజలకు, దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయమన్నారు. ఆయన మనమధ్య లేక పోయినా అందించిన సేవలు ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచి ఉన్నాయన్నారు. బీజేడీ పార్టీ శ్రేణులు బిజూ బాబుని ఆదర్శంగా తీసుకొని ప్రజా సేవకు అంకితమై పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపు నిచ్చారు. కార్యక్రమంలో కొరాపుట్ జిల్లా పార్టీ అధ్యక్షులు దుర్గా మిశ్ర, జయపురం మున్సిపల్ వైస్ చైర్మన్ బి.సునాత, మాజీ వైస్‌చైర్మన్ సూర్యనారాయణ రథ్ (మున్నా రథ్) బిజూ స్మృతి కమిటీ అధ్యక్షులు బాల రాయ్, సీనియర్ నేత నాగరాజు దొర, శివ పట్నాయక్, రాజా పాఢీ, కుని అధికారి, బాబు బిశాయి, బీజేడీ పార్టీ కౌన్సిలర్లు దేవ చౌధురి, ఆర్.పద్మ, పి.పద్మారెడ్డి, సుశీల్ పట్నాయక్, బుడు మహాపాత్రో, ధన్ ఖొర, మాధవ్ రథ్ పాల్గొని తమ ప్రియతమ నేతకు నివాళులు సమర్పించారు.
బిజూ పట్నాయక్ విగ్రహానికి శ్రద్ధాంజలి ఘటిస్తున్న మాజీమంత్రి రబినారాయణ నందో, నాయకులు


