18 నుంచి శ్రీరామ మందిర ప్రతిష్టోత్సవాలు | - | Sakshi
Sakshi News home page

18 నుంచి శ్రీరామ మందిర ప్రతిష్టోత్సవాలు

Apr 18 2026 8:35 AM | Updated on Apr 18 2026 8:35 AM

రాయగడ: సదరు సమితి పరిధిలోని జేకేపూర్‌ బీసీ రోడ్డు దుర్గా మండపం వెనుక కొత్తగా నిర్మించిన శ్రీరామ మందిర ప్రతిష్టోత్సవాలు ఈ నెల 18వ తేదీ నుంచి ప్రారంభమవుతాయి. దీని కోసం కమిటీ సభ్యులు సన్నహాలు ప్రారంభించారు. తొలి రోజు ఉదయం ఎనిమిది గంటలకు కలశ యాత్ర నిర్వహించనున్నారు. సమీపంలోని నాగావళి నది నుంచి సాస్త్రోక్తంగా శుద్ధ జలాలను తీసుకువచ్చి మందిరం వద్ద ఉంచి శుభ్రపరుస్తారు. 19న ఉదయం ఎనిమిది గంటల నుంచి రుగ్వేద, యజుర్వేద, సామవేద, అదర్వేద పఠనాలు కొనసాగుతాయి. 20న శిఖర పూజలు, 21న విశేష పూజలతో పాటు 23వ తేదీన ప్రాణప్రతిష్ట కార్యక్రమాలు ఉంటాయని నిర్వాహకులు తెలియజేశారు.

Advertisement
 
Advertisement
Advertisement