సీబీఎస్‌ఈ టెన్త్‌ ఫలితాల్లో ప్రతిభ | - | Sakshi
Sakshi News home page

సీబీఎస్‌ఈ టెన్త్‌ ఫలితాల్లో ప్రతిభ

Apr 18 2026 8:35 AM | Updated on Apr 18 2026 8:35 AM

సీబీఎస్‌ఈ టెన్త్‌ ఫలితాల్లో ప్రతిభ

జయపురం: సీబీఎస్‌ఈ పదో తరగతి పరీక్షల్లో జయపురం మోడరన్‌ ఇంగ్లిషు మీడియం పాఠశాల నూరు శాతం ఫలితాలు సాధించింది. ఈ పాఠశాల నుంచి 192 మంది పరీక్షకు హాజరవ్వగా అందరూ పాసయ్యారు. వారిలో కుమారి జునేరా తవాస్సమ్‌ 98.2 శాతం మార్కులతో టాపర్‌గా నిలిచింది. ఆమె తరువాత ప్రీతమ్‌ పాఘీ 97 శాతం మార్కులతో రెండో స్థానంలో నిలవగా.. సచిత్ర హోత్త 97 శాతం మార్కులతో మూడో స్థానంలో నిలిచినట్టు పాఠశాల డైరెక్టర్‌ కుముద మాల మహంతి శుక్రవారం వెల్లడించారు. 197 మంది పరీక్షలకు హాజరవ్వగా.. వీరిలో 23 మంది 90 శాతం పైగా మార్కులతో ఉత్తీర్ణులు కాగా, 80 శాతానికి పైగా మార్కులతో 22 మంది, 70 శాతానికి పైమార్కులతో 23 మంది, 60 శాతం మార్కులతో 29 మంది, 50 శాతం మార్కులతో 43 మంది, 40 శాతం పైమార్కులు పొంది 52 మంది ఉత్తీర్ణులైనట్టు వెల్లడించారు. ఈ విజయానికి కారకులైన ఉపాధ్యాయ సిబ్బంది, విద్యార్థులను పాఠశాల యాజనమాన్య ప్రతినిధులు అభినందించారు.

Advertisement
 
Advertisement
Advertisement