రాయగడ: జననాయకుడు, స్వాతంత్య్ర సమరయోధుడు స్వర్గీయ బిజూ పట్నాయక్ 29వ వర్ధంతిని బీజేడీ నాయకులు శుక్రవారం నిర్వహించారు. స్థానిక కొత్త బస్టాండు సమీపంలోని బిజూ పట్నాయక్ విగ్రహానికి ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి జగన్నాధ సరక, సీనియర్ నాయకులు, న్యాయవాది బ్రజసుందర్ నాయక్, అనసూయా మాఝి, జిల్లా పరిషత్ అధ్యక్షురాలు సరస్వతి మాఝి, బిజేడి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పట్నాన గౌరి శంకరరావు, జిల్లా పరిషత్ సభ్యులు ధవలేశ్వర్ నాయుడు, నీలొ గంతాయిత్ తదితరులు పూలమాలలు వేసి శ్రద్ధాంజజలి ఘటించారు. అనంతరం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలోని రోగులకు పండ్లు, రొట్టెలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా వక్తలు బిజూ పట్నాయక్ సేవలు కొనియాడారు.
మల్కన్‌గిరిలో బిజు పట్నాయక్ వర్ధంతి
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా కేంద్రంలో శుక్రవారం రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ బిజూ పట్నాయక్ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. మల్కన్‌గిరి బీజేపీ పార్టీ తరఫున మాజీ ఎమ్మెల్యే మానాస్ మాడ్కామి నేతృత్వంలో భిజు పట్నాయక్ విగ్రహం వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మల్కన్‌గిరి జిల్లా కోసం బిజూ బాబు చేసిన సేవలు ఏన్నో ఉన్నాయన్‌ానరు. ఇక్కడ ప్రజాల్లో చైతన్యం కోసం ఆయన సేవలు చీరస్మరణీయం అని అన్నారు . కార్యక్రమంలో మల్కన్‌గిరి మున్సిపల్ చైర్మన్ మనోజ్ బారిక్ , గోపాల్ పండా, కవితా మోహంతి, బీజేడీ సభ్యులు పాల్గున్నారు .
8 కిలోల గంజాయి పట్టివేత
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా కలిమెల సమితి యం.వి.79 పోలీసుస్టేషన్ పరిధిలో గంజాయి తరలిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి ఎనిమిది కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అయితే పోలీసులను చూసి బైక్ వదిలి పారిపోవోడానికి యత్నించిన వ్యక్తిని పోలీసులు వెంబడించి పట్టుకున్నారు. అతని వద్ద నుంచి గంజాయి బస్తాను స్వాధీనం చేసుకొని తూకం వేయగా ఎనిమిది కిలోలు ఉన్నట్టు నిర్ధారించారు. గంజాయిని కలిమెల ప్రాంతంలో కొనుగోలు చేసినట్టు నిందితుడు అంగీకరించారు. దీని విలువ రూ. 50 వేలు ఉంటుందని పోలీసులు చెప్పారు. నిందితుడు తెలంగాణాకు చెందిన వ్యక్తిగా పేర్కొన్నారు. పూర్తి విచరణ అనంతరం కేసు నమోదు చేసి కోర్టుకు తరలిస్తామని పోలీసులు తెలిపారు .
మహిళ మృతదేహం లభ్యం
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా సీక్‌పల్లి పంచాయతీ ఉస్కాలబాగ గ్రామ అడవిలో శుక్రవారం ఓ మహిళ మృతదేహం లభ్యమైంది. కేందు ఆకుల కోసం వెళ్లిన స్థానికులకు చెట్టు వేల్లాడుతూ ఓ మహిళ కనిపించింది. వెంటనే మల్కన్‌గిరి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటనా స్థలానికి పోలీసు ఐఐసీ రీగాన్‌కీండో వెల్లి పరిశీలించారు. అయితే ప్రాధమిక విచారణలో మృతురాలు పోడియా సమితి నాండిబేఢా గ్రామనికి చెందిన లాచా కురామి భర్య సమే సోడిగా గుర్తించారు . భర్త లాచా కురామి ఉపాధికోసం ఆంధ్రా పనులకు వలస వెళ్లాడు. ఈ నేపథ్యంలో సమేకు మరో వ్యక్తితో సంబంధం ఉందని కుటుంబ సభ్యులు ఆరోపించారు . అయితే ఈ ఇద్దరు గురువారం ఉస్కలబాగ్ గ్రామంలో జరిగిన ఓ వివహంలో పాల్గునీ అనంతరం ఆ వ్యక్తి సమేపై తన స్నేహితులు తో కలిసి త్యాచారం జరిపి అనంతరం హత్య చేసి వుంటాడు షని కుంటుంభ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మృతదేహన్ని స్వదీనం చేసుకోన్ని సైటీఫీక్ బృందం వస్తే పూర్తి వివరాలు తేలుస్తాయి ఆ తరువతే పోస్టుమాఠం నిర్వహించి మృతదేహం అప్పగిస్తాం అని ఐఐసి రీగాన్ కీండొ తేలిపారు మృతదేహన్ని మల్కన్‌గిరి ప్రభుత్వాస్పత్రి తరలించారు . నిందితుల కోసం గాలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.


