ఉత్సాహంగా కవి సమ్మేళనం | - | Sakshi
Sakshi News home page

ఉత్సాహంగా కవి సమ్మేళనం

Apr 17 2026 10:26 AM | Updated on Apr 17 2026 10:26 AM

జయపురం: జయపురం పూజ్య పూజ సాహిత్య సంసద్‌ గురువారం సాహితీ సమ్మేళనం నిర్వహించింది. కార్యక్రమంలో శారద విహార్‌ సరస్వతీ విద్యామందిరం ఆచార్యులు అనంత నారాయణ మహాపాత్రో ముఖ్యఅతిథిగా పాల్గొని మన సంస్కృతి కళలకు సాహిత్యం దర్పణం అన్నారు. అందుచేత సాహిత్యం, భాషలను పరిరక్షించుకోవాలన్నారు. కార్యక్రమంలో బొయిపరిగుడ కళాశాల అధ్యాపకులు మానసీ ఆచార్య ముఖ్యవక్తగా పాల్గొని సాహిత్య విలువలు, ఒడియా సాహిత్య ప్రగతి లపై ప్రసంగించారు. ఈ సందర్భంగా స్వీయ కవితా పఠన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ప్రముఖ కవి ప్రదీప్‌ కుమార్‌ సాహు, మాధురీ పండ, మానసీ ఆచార్య, రాధామోహన పండ, సంధ్యారాణి సాహు తదితరులు పాల్గొని కవితలు వినిపించారు.పూజ్య పూజ సంసద్‌ ఉపాద్యక్షలు తపన్‌ కిరణ్‌ త్రిపాఠీ అద్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలొ బిపిన్‌ పాత్రో, ఆరాధ్య కౌశిక్‌, ధనిశ కౌశిక్‌, సంతోష్‌ కుమార్‌ బ్రహ్మ, సంస్కృతి సామంతరాయ్‌, సుశ్రీ సామంతరాయ్‌, స్వస్థిక్‌ ప్రసాద్‌ బెహర,శుభశ్రీ మహాపాత్రో,ఆశిష్‌ కుమార్‌ మహాపాత్రో, స్మిత పాత్రో, మాధురీ పండ, చంధ్ర శేఖర పాత్రో, గౌరీ పండ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించారు. పోటీల్లో విజేతలకు అతిథులు బహుమతులతో సత్కరించారు. కార్యక్రమాన్ని సంస్థ కార్యదర్శి భైరాగీ సాహు.మృత్యజయ సాహులు పర్యవేక్షించగా సరస్వతీ సాహు సభికులకు ధన్యవాదాలు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement