భువనేశ్వర్: అంగరంగ వైభవంగా ఆరంభమైన ఖుర్దారోడ్ అకౌంట్సు కాలనీ కొండపై నెలకొన్న శ్రీ వెంకటేశ్వరుని 33వ వార్షికోత్సవ సమేత బ్రహ్మోత్సవం గురువారం ఆనందోత్సాహాలతో ముగిసింది. ముగింపు కార్యక్రమంలో భాగంగా ఉభయ నాంచారీ సమేతంగా శ్రీనివాసుని పుర వీధుల్లో ఊరేగింపు కార్యక్రమం శాంతియుతంగా ముగిసినట్లు నిర్వాహక సంస్థ కార్యదర్శి జేకే రావు తెలిపారు. ఈ ఊరేగింపు స్థానిక ఉత్తరాయణి మందిర ప్రాంగణం నుంచి ప్రధాన దేవస్థానం వరకు కొనసాగింది. సీతారాం ఛక్, రైల్వే కాలనీ వీధుల గుండా కొనసాగిన ఊరేగింపులో మహిళల కోలాటం చూపరుల్ని ఆకట్టుకుంది.


