మల్కన్‌గిరి: కలిమెల సమితి ఎం.వి.79 పోలీసుస్టేషన్ పరిధిలో తమానపల్లిలో బుధవారం మేకలు దొంగతనానికి ప్రయత్నించిన నిందితులు గ్రామస్తులకు పట్టుబడ్డారు. నలుగురు వ్యక్తులు మేకలు చోరీ చేస్తుండగా ఎం.వి.113 గ్రామం వద్ద స్థానికులు గుర్తించారు. వెంటనే నిందితులు పిస్టల్‌తో రెండు రౌండ్లు కాల్పులు జరిపి పరారయ్యారు. వారిలో రాహుల్ శికారి, సుజయ్ మండల్‌ను వెంబడించి గ్రామస్తులు పట్టుకుని దాడి చేశారు. విషం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన ఇద్దరినీ కలిమెల ఆరోగ్య కేంద్రానికి తరలించారు. సుజయ్ పరిస్థితి విషమంగా ఉండటంతో మల్కన్‌గిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బెంగాలీ –ఆదివాసీల మధ్య ఇటీవలే గొడవలు జరిగి ఇప్పుడిప్పుడే శాంతియువత వాతావరణం నెలకొంటోంది. ఈ తరుణంలో రెండు వర్గాలు గొడవకు దిగడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.


