అంబేడ్కర్‌ జయంతి | - | Sakshi
Sakshi News home page

అంబేడ్కర్‌ జయంతి

Apr 15 2026 8:32 AM | Updated on Apr 15 2026 8:32 AM

● ఒకరు అరెస్టు

న్యూస్‌రీల్‌

బుధవారం శ్రీ 15 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2026
ఘనంగా..

శ్రీ జగన్నాథునికి కొత్త రత్న శోభిత మంచం

భువనేశ్వర్‌: ఒడియా నూతన సంవత్సరం పురస్కరించుకుని పూరీ శ్రీ మందిరంలో శ్రీ జగన్నాథుని సమేత సోదర సోదరీ బలభద్రుడు, దేవీ సుభద్ర కోసం రత్నాలతో అలంకరించిన కొత్త మంచాలు సిద్ధం చేశారు. వీటిని దేవతల విరామ సేవలో వినియోగిస్తారు. ఇప్పటి వరకు వినియోగించిన పాత మంచాలు తొలగించారు. అంత కంటే ముందు ఆలయ సంప్రదాయాల ప్రకారం కొత్త మంచాలకు శుద్ధీకరణతో లాంఛనంగా ప్రతిష్టించారు. కొత్తగా సిద్ధం చేసిన 3 మంచాలకు వెండి తాపడంతో రత్నాలతో అలంకరించి ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. పాత రత్నాల మంచాలను శ్రీ మందిరం ప్రాంగణంలో నీలాద్రి మ్యూజియంలో భద్రంగా ప్రదర్శించాలని యోచిస్తున్నారు. వాటిని ఎక్కడ ఉంచాలనే విషయంపై ఆలయ పాలక మండలి సమావేశంలో తుది నిర్ణయం తీసుకుంటామని శ్రీ జగన్నాథ ఆలయం ముఖ్య నిర్వాహకుడు సీఏఓ డాక్టర్‌ అరవింద కుమార్‌ పాఢి తెలిపారు.

రక్తదాన శిబిరం

జయపురం: కొరాపుట్‌ జిల్లా ఎస్సీ, ఎస్టీ మైనారిటీ సమైక్య మంచ్‌ అంబేడ్కర్‌ జయంతి సందర్భంగా జయపురం జిల్లా కేంద్రాస్పత్రిలో రక్తదాన శిబిరం నిర్వహించింది. కార్యక్రమంలో నవరంగపూర్‌ జిల్లా పరిషత్‌ మాజీ సభ్యులు లలిత మోహణ నాయిక్‌ ముఖ్యఅతిథిగా పాల్గొని రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. 55 యూనిట్ల రక్తం సేకరించారు.

సమానత్వ మార్గదర్శి

అంబేడ్కర్‌

భువనేశ్వర్‌: రాష్ట్ర గవర్నర్‌ డాక్టర్‌ హరిబాబు కంభంపాటి ప్రథమ మహిళ జయశ్రీ కంభంపాటితో కలిసి భారత రత్న బీఆర్‌ అంబేడ్కర్‌ 135వ జయంతి పుష్పాంజలి ఘటించారు. డాక్టర్‌ అంబేడ్కర్‌ రాజ్యాంగ ప్రధాన రూపశిల్పిగా న్యాయం, సమానత్వం, మానవ గౌరవం వంటి ఆదర్శాలకు తన జీవితాన్ని అంకితం చేసిన దార్శనికుడిగా పేరొందారని తెలిపారు. సమ్మిళిత, సమానత్వ సమాజం దిశగా దేశం సాగిస్తున్న ప్రయాణానికి డాక్టర్‌ అంబేడ్కర్‌ వారసత్వం మార్గదర్శకంగా నిలుస్తుందన్నారు.

22 కిలోల గంజాయి స్వాధీనం

రాయగడ: పుల్బాణి నుంచి ఆంధ్రప్రదేశ్‌కు గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ఒక వ్యక్తిని మునిగుడ పోలీసులు పట్టుకున్నారు. అతని వద్ద నుంచి 22 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాకు చెందిన యనామాల్‌ దినేస్‌గా గుర్తించారు. పోలీసులు తెలియజేసిన వివరాల ప్రకారం.. గంజాయి అక్రమ రవాణా జరుగుతుందన్న సమాచారం మేరకు మునిగుడ పోలీస్‌ స్టేషన్‌ పరిధి దేవకుపిలి కూడలిలో వాహనాల తనిఖీలను సోమవారం నిర్వహించారు. బలిగుడ నుంచి గంజాయి పట్టుకుని యనమాల్‌ దినేస్‌ వాహనంలో తీసుకువస్తుండగా పట్టుబడ్డాడు. నిందితుని నుంచి గంజాయితో పాటు ఒక మోబైల్‌ ఫొన్‌, 1170 రూపాయల నగదును పోలీసులు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి కోర్టుకు తరలించారు.

జయపురం :

బీఆర్‌ అంబేడ్కర్‌ జయంతి సందర్భంగా జయపురంలో సబ్‌డివిజనల్‌ సమాచార ప్రజా సంబంధాల అధికారి యశోద గదబ అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. జయపురం బీజేడీ పార్టీ శ్రేణులు డాక్టర్‌ అంబేడ్కర్‌ విగ్రహానికి పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించాయి. కొరాపుట్‌ జిల్లా బీజేడీ కార్యనిర్వాహక అధ్యక్షుడు దుర్గా ప్రసాద్‌ మిశ్రా, సీనియర్‌ బీజేడీ నేత, ఆ పార్టీ కార్మిక విభాగ అద్యక్షులు బాలా రాయ్‌, జయపురం మున్సిపాలిటీ మాజీ వైస్‌ చైర్మన్‌ సూర్యనారాయణ రథ్‌(మున్నా రథ్‌)నేతృత్వంలో అనేకమంది పార్టీ కార్యకర్తలు అంబేడ్కర్‌కు నివాళులు అర్పించారు.

జయపురంలో..

జయపురం : అంబేడ్కర్‌ 135 వ జయంతి సందర్భంగా స్థానిక జిల్లా కాంగ్రెస్‌ భవనంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. తురుక్‌ ప్రసంగిస్తూ దేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఆయన పాత్ర కీలకమన్నారు.

రాయగడలో..

రాయగడ: రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ ఆంబేడ్కర్‌ 136 వ జయంతి ఉత్సవాలు పట్టణంలో ఘనంగా జరిగాయి. జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో స్థానిక కొత్త బస్టాండ్‌ వద్ద గల అంబేడ్కర్‌ విగ్రహం వద్ద కలెక్టర్‌ అశుతోష్‌ కులకర్ణి, రాయగడ ఎమ్మెల్యే అప్పల స్వామి కడ్రక, కొరాపుట్‌ లొక్‌సభ ఎంపీ సప్తగిరి శంకర్‌ ఉలక, జిల్లా పరిషత్‌ ముఖ్యకార్యనిర్వాహక అధికారి అక్షయ కుమార్‌ ఖెముండొ, సబ్‌ కలెక్టర్‌ రమేష్‌ కుమార్‌ జెన్న, జిల్లా అదనపు కలక్టర్‌ నిహారి రంజన్‌ కుహోరొ , ఎడిఎం నవీన్‌ చంద్ర నాయక్‌, ఐటీడీఏఏ ప్రాజెక్టు అధికారి చంద్రకాంత్‌ మఝి తదితరులు పాల్గొని పూల మాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అదేవిధంగా డొంబ్‌ సమాజానికి చెందిన ప్రతినిధులు అంబేడ్కర్‌ జయంతిని

పురష్కరించుకుని నివాళులు అర్పించారు.

పర్లాకిమిడి: బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ జయంతి వేడుకలు పర్లాకిమిడిలో జిల్లా అధికార యంత్రాంగం తరఫున ఘనంగా నిర్వహించారు. తొలుత కొత్త బస్టాండు వద్ద అంబేడ్కర్‌ విగ్రహానికి కలెక్టర్‌ అక్షయ సునీల్‌ అగర్వాల్‌ పూలదండలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అంతకు ముందు భీంరావ్‌ నినాదాలతో కొత్త బస్టాండ్‌ వరకూ పురపాలక సంఘం చైర్మన్‌ ఆధ్వర్యంలో బైక్‌ ర్యాలీ జరిపారు. అనంతరం ఆదనపు జిల్లా మేజిస్టేట్‌ మునీంద్ర హానగ, పురపాలక సంఘం చైర్మన్‌ నిర్మలా శెఠి, పురపాలక సంఘం ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ లక్ష్మణ ముర్ము, గుసాని మాజీ చైర్మన్‌ భారతమ్మ, జైభీమ్‌ సంఘం అధ్యక్షులు పాపారావు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. పర్లాకిమిడి ఎమ్మెల్యే రూపేష్‌ పాణిగ్రాహి అంబేద్కర్‌ జయంతి సందర్భంగా హైస్కూల్‌ జంక్షన్‌ నుంచి స్వయంగా బైక్‌ ర్యాలీలో పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement