పర్లాకిమిడి: హనుమాన్ జయంతి, ఒడియా నూతన సంవత్సర వేడుకలను పర్లాకిమిడిలో మంగళవారం ఉత్సాహంగా జరుపుకున్నారు. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని స్థానిక గుండిచామందిరం వద్ద ఉన్న ఆంజనేయ మందిరంలో భక్తులు కొబ్బరికాయలు కొట్టి హనుమాన్ చాలీసా చదివారు. అలాగే కంజావీధి, కేవుటివీధి, ఉప్పరవీధి, రైల్వేస్టేషన్, కొత్త బస్టాండ్ హనుమాన్ మందిరాల వద్ద ప్రత్యేక పూజలు చేసి భక్తులకు పానకాన్ని పంచిపెట్టారు. మధ్యాహ్నం భక్తులకు అన్నప్రసాదాన్ని వితరణ చేశారు. రాజవీధిలోని జగన్నాథ మందిరం ఆవరణలో సీనియర్ సిటిజన్ ఫోరం సభ్యులు బాటసారులకు పానకం పంపిణీ చేసి భక్తిని చాటుకున్నారు.


