వసుంధర ఉట్టె | - | Sakshi
Sakshi News home page

వసుంధర ఉట్టె

Apr 15 2026 8:32 AM | Updated on Apr 15 2026 8:32 AM

వసుంధర ఉట్టె

ఒడియా కొత్త సంవత్సరాదిలో మరో ప్రత్యేక ఆచారం వసుంధర ఉట్టె. వేసవి తాపం నుంచి పుడమి తల్లికి నిరంతరం చెమ్మ పర్యావరణం కల్పించడం ఈ ఆచారం ఆంతర్యంగా స్పష్టం అవుతుంది. ఈ ఆచారంలో చిన్న రంధ్రం కలిగిన మట్టి పాత్రంలో నీరు నింపి పవిత్ర తులసి మొక్క పైభాగంలో ఉట్టెని ఏర్పాటు చేసి అమర్చుతారు. తొలుత సంప్రదాయ రీతిలో తయారు చేసిన పానకం పోసి నీటితో నింపుతారు. ఇంటి ముంగిట అను నిత్యం పూజలందుకునే తులసి మొక్క పైభాగంలో అమర్చిన ఉట్టె నుంచి ఒక్కో బొట్టుగా చల్లని నీరు కారుతు మొక్క అడుగు భాగంలో మట్టిని దీర్ఘకాలం చెమ్మగా పరిరక్షిస్తుంది. ఈ క్రమంలో వేసవి తాపం నుంచి పుడమి తల్లి పరిరక్షణ పచ్చని మొక్క సంరక్షణతో ఆరోగ్యవంతమైన పర్యావరణం ఆవిష్కరణకు దోహదపడుతుందని వర్ధమాన తరాలకు కొత్త సంవత్సరం ఆరంభం వేడుకల్లో భాగంగా పరిచయం చేయడం ఆనవాయితీలో ఇమిడిన అంతరార్థం.

తులసి మొక్కపై వసుంధర ఉట్టె

Advertisement
 
Advertisement
Advertisement