వేసవి తాపం ఉపశమనం | - | Sakshi
Sakshi News home page

వేసవి తాపం ఉపశమనం

Apr 15 2026 8:32 AM | Updated on Apr 15 2026 8:32 AM

వేసవి తాపం ఉపశమనం

కొత్త సంవత్సరం నుంచి వేసవి తాపం ఊపందుకుంటుంది. ఈ వాతావరణంలో ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందుతు వడ దెబ్బ తాకిడికి దూరంగా ఉండేందుకు సంకేతంగా పానంకం ఇష్ట దైవానికి నివేదించడంతో బంధు మిత్రులకు ఇచ్చిపుచ్చుకోవడం, ఎక్కడికక్కడ చలి వేంద్రాలు ఏర్పాటు చేసి లాంచనంగా పాణకం వితరణ చేయడం ఆనవాయితీగా కొనసాగుతుంది. ఈ రోజున, వేసవి ప్రారంభానికి గుర్తుగా దేవతలకు పాణాను సమర్పిస్తారు. శరీరానికి చలువ చేకూర్చి ఆరోగ్యానికి అనుకూలించే మారేడు పండు (బెల్ల), కొబ్బరి, బెల్లం, పెరుగు, అరటి పండ్లు, మిరియాలు వంటి సుగంధ ద్రవ్యాలతో రుచికరమైన పాణకం తయారు చేసి ఒకరికి ఒకరు ఇచ్చిపుచ్చుకుంటారు. ఈ చల్లని పానీయం వేసవి వేడి నుండి శరీరాన్ని చల్లగా ఉంచడానికి సహాయపడుతుంది.

Advertisement
 
Advertisement
Advertisement