పర్లాకిమిడి: ఒడియా కొత్త సంవంత్సరాది సందర్భంగా మన కళ, సంస్కృతి, పరంపర ఎప్పుడూ కాపాడుకోవాలని ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి అన్నారు. స్థానిక బిజూకళ్యాణ మండపంలో మంగళవారం నిర్వహించిన ఒడియా పక్షోత్సవాలు ముగింపు వేడుకలకు ముఖ్యఅతిథిగా విచ్చేశారు. కార్యక్రమంలో ఏడీఎం ఫల్గునీ మఝి, పురపాలక సంఘం చైర్మన్ నిర్మలా శెఠి, జిల్లా పరిషత్తు ఆదనపు సీడీవో ఫృథ్వీరాజ్ మండళ్, డీసీపీయూ అరుణ్ కుమార్ త్రిపాఠి, జిల్లా సాంస్కృతిక శాఖ అధికారి అర్చనా మంగరాజ్, పురపాలక ఈ.ఓ. లక్ష్మణ ముర్ము, కౌన్సిలర్లు బబునా బెహారా, బాలక్రిష్ణపాత్రో విచ్చేశారు. ఈ సందర్భంగా ఒడిస్సీ, జానపద, ఆధునిక నృత్యాలతో ప్రేక్షకులను అలరించారు. కళాకారులందరకీ మెమెంటోలు, ప్రశంసాపత్రాలతో ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి చేతులమీదుగా బహుమతి ప్రదానం చేశారు.


