ఘనంగా అభయ ఆంజనేయ స్వామి బ్రహ్మోత్సవం | - | Sakshi
Sakshi News home page

ఘనంగా అభయ ఆంజనేయ స్వామి బ్రహ్మోత్సవం

Apr 15 2026 8:32 AM | Updated on Apr 15 2026 8:32 AM

జయపురం: జయపురం దైనిక బజారులో వేంచేసి ఉన్న అభయ ఆంజనేయ స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి. చైత్రమాస బహుళ ద్వాదశి మంగళవారం ఆంజనేయ స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామికి పూజలు చేసేందుకు భక్తులు పోటెత్తారు. జయపురం చిరంజీవి కల్చరల్‌ అసోసియేషన్‌, డైలీ మార్కెట్‌ మర్చంట్స్‌ అసోసియేషన్‌లు సంయుక్తంగా నిర్వహించిన స్వామి వారి బ్రహ్మోత్సవాలు విఘ్నేశ్వర పూజతో ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమమంలో పంచామృతాభిషేకం, తమలపాకులతో పూజలు, సింధూరార్చన మొదలగు పూజలు జరిగాయి.ఈ సందర్బంగా శ్రీవల్లీదేవసేన సమేత సుభ్రమణ్య స్వామి వారా కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిపించారు.ఈ కార్యక్రమాలు పూజలు ఆలయ అర్చకులు ముకావిల్లి సంతోష్‌ కుమార్‌ శర్మ గారి బ్రహ్మత్వంలో శ్రీకాకుళం వాస్తవ్యులు విద్యాపాసకులు నేతేటి నాగేంధ్ర శర్మ గారి నేతృత్వంలో బైదిక పద్దతిలో నిర్వహించారు.శ్రీఅభయాంజనేయ స్వామివారి బ్రహ్మోత్సవాలను చిరంజీవి కల్చరల్‌ అషోషియేషన్‌ , డైలీ మార్కెట్‌ మర్చంట్స్‌ అసోసియేషన్‌ కార్యకర్తలు పర్యవేక్షించారు.

Advertisement
 
Advertisement
Advertisement