సమర్థ నాయకురాలు | - | Sakshi
Sakshi News home page

సమర్థ నాయకురాలు

Apr 14 2026 9:04 AM | Updated on Apr 14 2026 9:04 AM

న్యూస్‌రీల్‌

గవర్నర్‌ డాక్టర్‌ హరిబాబు

కంభంపాటి

మంగళవారం శ్రీ 14 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2026
భారతీయ మహిళ..

భువనేశ్వర్‌:

జాతీయ సమ్మిళిత అభివృద్ధికి మహిళా సాధికారత అత్యవసరమని గవర్నర్‌ డాక్టర్‌ హరిబాబు కంభంపాటి అన్నారు. మహిళ గౌరవపూర్వక ఉన్నతీకరణతో సమగ్ర సమాజం గౌరవ ప్రతిష్టలతో ముందుకు సాగుతుందని ఆయన పేర్కొన్నారు. నగరంలో నిర్వహించిన నారీ శక్తి–ఒడియా అస్మిత కార్యక్రమంలో గవర్నర్‌ ప్రసంగిస్తూ మహిళలు కుటుంబాలకు పునాది అని, విలువలను నేర్పే తొలి గురువులని తెలిపారు. కరుణామయ, ప్రగతిశీల సమాజానికి నిశ్శబ్ద రూపశిల్పులన్నారు. నేటి మహిళలు పరిపాలన, విద్య, ఆరోగ్య సంరక్షణ, విజ్ఞానం, సాంకేతికత, వ్యవస్థాపకత, క్రీడలు, కళలు, సాయుధ దళాలు వంటి విభిన్న రంగాలలో విజయవంతంగా రాణిస్తున్నారని గవర్నర్‌ అన్నారు. ఆత్మవిశ్వాసం, సామర్థ్యంతో ఆధునిక భారతీయ మహిళ తనంతట తానుగా నాయకురాలుగా వెలుగొందుతుందని అన్నారు. ఆర్థిక, సామాజిక, నిర్ణయ ప్రక్రియలలో మహిళల చురుకై న చొరవ సమ్మిళిత అభివృద్ధిని సాధ్యం చేస్తుందని తెలిపారు. నారీ శక్తి వందన అధినియమ్‌ ఆమోదం ఒక చారిత్రాత్మక చర్యగా అభివర్ణించారు. ఇది పరిపాలనలో మహిళల ప్రాతినిధ్యాన్ని పెంపొందించి, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తుందని గవర్నర్‌ అన్నారు. రాష్ట్ర వారసత్వంలో లోతుగా పాతుకుపోయిన ఒడియా అస్మిత పరిరక్షణ, ప్రోత్సాహంలో మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు. అభివృద్ధి చెందుతున్న ఒడిశా నిర్మాణంలో మహిళా నేతృత్వం కీలకమని పేర్కొన్నారు. జీవితంలోని అన్ని రంగాలలో మహిళలకు సమాన అవకాశాలు కల్పించేందుకు సమష్టి కృషి చేయాలని పిలుపునిచ్చారు. సన్మాన గ్రహీత మహిళా విజేతలను గవర్నర్‌ అభినందించారు.

Advertisement
 
Advertisement
Advertisement