చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ఎన్నికల ఫలితాలు వెల్లడి | - | Sakshi
Sakshi News home page

చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ఎన్నికల ఫలితాలు వెల్లడి

Apr 14 2026 9:04 AM | Updated on Apr 14 2026 9:04 AM

జయపురం: జయపురం చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీన్‌ డైరెక్టర్ల ఎన్నికలు శనివారం జరిగాయి. పోలైన ఓట్ల లెక్కింపు ప్రక్రియను ఎన్నికల అధికారిగా వ్యవహరించిన చార్టెడ్‌ అకౌంటెంట్‌ ఎన్‌.ఆనందరావు పర్యవేక్షణలో చేపట్టి ఫలితాలు వెల్లడించారు. 21 మంది డైరెక్టర్ల పదవులకు 36 మంది పోటీ చేయగా అధిక ఓట్లు పొందిన వారిని విజేతలుగా ప్రకటించారు. సంజయ్‌ కుమార్‌ జైన్‌ అత్యధిక ఓట్టు పొందారు. ఆయనకు 610 ఓట్లు రాగా రెండవ స్థానంలో నేమాని చైతన్య 590 ఓట్లు పొందారు. 583 ఓట్లు సాధించి కె.దిలీప్‌రెడ్డి మూడో స్థానంలో నిలిచారు. మిగతా వారిలో సుకరి దినేష్‌ 576, కె.రామకృష్ణ 557, సతీష్‌కుమార్‌ పాత్రో 555, ఎ.శ్రీనివాసరావు 551, వి.ప్రభాకర్‌ 516, డి.మాధవ్‌ 494, బి.సతీష్‌కుమార్‌ 490, గెంబలి వసంతరావు 475, సంజయకుమార్‌ జైన్‌ 470, సీహెచ్‌ కిశోర్‌ కుమార్‌ 462, కెల్ల ఈశ్వరరావు 460, లోకనాథ్‌పాత్రో 459, అంకుర్‌ సోని 452, మనోజ్‌ కుమార్‌ షాహా 443, బిభుదత్త పాఢీ 404, చంద్రేష్‌రాథోడ్‌ 400, వరుణ్‌ కుమార్‌ జైన్‌ 391, సూర్యనారాయణ పట్నాయక్‌ 384 ఓట్లు పొంది డైరెక్టర్లుగా ఎన్నికై నట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు.

Advertisement
 
Advertisement
Advertisement